కారేపల్లిలో ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో డ్రైవర్ల రాస్తారోకో

కారేపల్లి, వెలుగు: ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని కారేపల్లి క్రాస్ రోడ్ లో ఆటో డ్రైవర్లు బుధవారం రాస్తా రోకో చేశారు. ఖమ్మం -ఇల్లెందు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఆటో కార్మికులకు ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. 

రవాణా శాఖ ఏఓకు వినతి

ఖమ్మం టౌన్, వెలుగు : సిటీలోని ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఆలిండియా రోడ్డు ట్రాన్స్ ఫోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం రవాణా శాఖ ఏఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పెరబోయిన మోహన్ రావు పాల్గొన్నారు.