మహాలక్ష్మీ స్కీమ్ తో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వాహన సంఘాలు 2024 ఫిబ్రవరి16వ తేదీన హైదరాబాద్ లో ఆటోల బంద్‌కు పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే తెలంగాణ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు (JAC) రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను కలిసి సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ సమ్మెను విజయవంతం చేయాలని టీఏటీయూ ఆటో యూనియర్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య కోరారు.
ALSO READ :- సోషల్ మీడియాలో తోచిన విధంగా పోస్టులు పెడుతుర్రు.. ఇది సున్నిత మైన అంశం : డీసీపీ
తెలంగాణలో ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉచిత బస్సు వల్ల ఆర్థికంగా నష్టపోయిన ఆటోడ్రైవర్లు నెలకు రూ.15 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.