![ఆటో సేల్స్ 7 శాతం అప్.. 16 శాతం పెరిగిన పీవీల అమ్మకాలు](https://static.v6velugu.com/uploads/2025/02/auto-industry-retail-sales-off-to-promising-start-in-2025-up-7-percent-in-jan-fada_beaVcBZ8h0.jpg)
న్యూఢిల్లీ: మన దేశంలో వాహనాల రిటైల్అమ్మకాలు గత నెలలో ఏడు శాతం పెరిగి 22,91,621 యూనిట్లకు చేరాయి. గత ఏడాది జనవరిలో 21,49,117 యూనిట్లు అమ్ముడయ్యాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్(ఫాడా) తెలిపింది. ప్యాసింజర్ వెహికల్స్(పీవీ) అమ్మకాలు ఏడాది ప్రాతిపాదికన 16 శాతం ఎగిసి 4,65,920 యూనిట్లకు చేరాయని ఫెడరేషన్ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ చెప్పారు.
టూవీలర్లు, త్రీవీలర్లు, ట్రాక్టర్లు, కమర్షియల్ వెహికల్స్అమ్మకాలు కూడా బాగున్నాయని చెప్పారు. ఇన్వెంటరీ స్థాయిలు 50–55 రోజుల స్థాయికి పడిపోయాయి. టూవీలర్ల అమ్మకాలు నాలుగు శాతం పెరిగి 15,25,862 యూనిట్లకు చేరాయి. కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలు ఎనిమిది శాతం పెరిగి 99,425 యూనిట్లకు ఎగిశాయి. ట్రాక్టర్ సేల్స్ ఐదు శాతం పెరిగి 93,381 యూనిట్లకు చేరాయి.