విధిరాత అంటే ఇదే: ఒళ్లంతా టాటూల కోసం మత్తు ఇచ్చారు.. ఆ మత్తులోనే గుండెపోటుతో చనిపోయాడు

విధిరాత అంటే ఇదే: ఒళ్లంతా టాటూల కోసం మత్తు ఇచ్చారు.. ఆ మత్తులోనే గుండెపోటుతో చనిపోయాడు

ఇతను ఆషామాషీ వ్యక్తి కాదు.. ప్రఖ్యాత బ్రెజిలియన్ ఆటో ఇన్‌ఫ్లుయెన్సర్.. కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన కొత్త కొత్త కార్లకు రివ్యూలు చెప్తూ ఆకట్టుకుంటుంటాడు. కాకపోతే, అతనికో ఫ్యాషన్ ఉంది.. తరచుగా శరీరంపై టాటూస్ వేయించుకోవడం అతనికి అలవాటు. ఆ ప్రయత్నంలోనే ఒంటిపై టాటు  వేపించుకుంటుండగా.. అనస్థీషియా మత్తుతో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. 

బ్రెజిలియన్ ఆటో ఇన్‌ఫ్లుయెన్సర్ రికార్డో గోడోయ్ అనస్థీషియాలో మత్తులో ప్రాణాలు వదిలినట్లు వైద్యులు నిర్ధారించారు. గోడోయ్ తన వీపు మొత్తానికి పచ్చబొట్టు వేయించుకుంటుండగా ఈ ఘటన జరిగింది. టాటూ వేసే సమయంలో నొప్పి లేకుండా ఉండేందుకు అతనికి అనస్థీషియా ఇచ్చారు. ఆ మత్తు పనిచేయడం ప్రారంభించిన కొద్దిసేపటికే అతను కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యాడు. హుటాహుటీన అతన్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ, ఫలితం దక్కలేదు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ALSO READ | అమెరికాలో వెతికి మరీ 500 మంది అరెస్ట్: ఆపరేషన్ ట్రంప్ మొదలైపోయింది..!

గోడోయ్‌కి ఇన్‌స్టాగ్రామ్ లో 225,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. అతని మరణవార్త తెలిసి వారంతా విషాదంలో మునిగిపోయారు.