11 ఏండ్లుగా మీటర్​ చార్జీలు పెంచలే

11 ఏండ్లుగా మీటర్​ చార్జీలు పెంచలే
  • సంక్షేమ బోర్డు పెట్టి ఆదుకోవాలని ఆటో డ్రైవర్ల భిక్షాటన

జూబ్లీహిల్స్, వెలుగు: మహిళలకు ఉచిత బస్సు పథకంతో తమ జీవితాలు రోడ్డున పడ్డాయని తెలంగాణ ఆటో డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రవి వాపోయారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ ఆదివారం బంజారాహిల్స్ లోని బసవతారకం ఆస్పత్రి వద్ద ఆటోడ్రైవర్లు భిక్షాటన చేశారు.

రవి మాట్లాడుతూ .. 11 ఏండ్లుగా ప్రభుత్వం మీటర్​ఆర్జీలు పెంచలేదన్నారు. ఆర్థిక సమస్యలతో  దాదాపు 57 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఓలా, ఊబర్ సర్వీసులను నిషేధించాలని, ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆదుకోవాలని డిమాండ్​చేశారు.