కోండగట్టు దగ్గర ఆటో బోల్తా..11 మందికి గాయాలు

జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్  రోడ్డుపై  ప్రమాదం జరిగింది. అంజన్నను దర్శించుకుని ఘాట్ రోడ్డు నుంచి  కిందకువస్తుండగా ప్రమాదవశాత్తు  ఆటో బోల్తా పడి 11 మందికి గాయాలయ్యాయి.  స్థానికుల సమచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని అంబులెన్స్ లో  జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. గాయపడిన వారంతా మంచిర్యాల జిల్లా లక్షట్ పేట మండలం మ్యాదరిపేటకు చెందినవారిగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. ముగ్గురికి తీవ్రగాయాలు కాగా 9 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి.