పెరిగిన ఆటో అమ్మకాలు..L&T సేల్స్ 23శాతం అప్

 పెరిగిన ఆటో అమ్మకాలు..L&T సేల్స్ 23శాతం అప్

న్యూఢిల్లీ:  భారతీయ ఆటో మార్కెట్ అమ్మకాలు గత నెల కొద్దిగా పెరిగాయి. కొన్ని కంపెనీల సేల్స్​ మాత్రం నిరాశపర్చాయి. మారుతి సుజుకి మార్చి 2024 లో 1,87,196 యూనిట్లను అమ్మగా, మార్చి 2025 లో మొత్తం 1,92,984 యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఏడాది లెక్కన సేల్స్​ మూడు శాతం పెరిగాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి 22,34,266 యూనిట్లను విక్రయించింది. 

మహీంద్రా అండ్​ మహీంద్రా బలమైన వృద్ధిని కనబర్చింది. దీని అమ్మకాలు ఏడాది లెక్కన 68,413 యూనిట్ల నుంచి 23 శాతం పెరిగి 83,894 యూనిట్లకు చేరాయి. దేశీయ యుటిలిటీ వెహికల్ మార్కెట్‌‌లో మహీంద్రా 48,048 బండ్లను విక్రయించింది. ఈ సెగ్మెంట్​ అమ్మకాలు 18శాతం పెరిగాయి. టీవీఎస్ మోటార్స్ గత మార్చిలో 3,54,592 యూనిట్లను అమ్మగా, ఈసారి ఇవి 17 శాతం పెరిగి 4,14,687 యూనిట్లకు చేరుకున్నాయి. 

టాటా మోటార్స్ సేల్స్​ 90,822 యూనిట్ల నుంచి 90,500 యూనిట్లకు తగ్గాయి. ఐషర్ మోటార్స్  గత మార్చిలో 75,551 బైకులను అమ్మగా, ఈసారి మార్చిలో  1,01,021 యూనిట్లను అమ్మింది. ఏడాది ప్రాతిపదికన​ అమ్మకాల్లో 34శాతం పెరుగుదల కనిపించింది. హ్యుందాయ్ మార్చి 2025 లో 67,320 యూనిట్లు అమ్మింది. ఓలా ఎలక్ట్రిక్ 2025 ఆర్థిక సంవత్సరం లో 3,44,005 యూనిట్లను అమ్మింది.