ఆటో బోల్తా.. ఒకరు మృతి

ఆటో బోల్తా.. ఒకరు మృతి
  • మరో 9 మందికి గాయాలు
  •  రంగారెడ్డి జిల్లాలో ఘటన

షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడలో ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. ఎస్ఐ విజయ్ కుమార్ వివరాల ప్రకారం..10 మంది ప్యాసింజర్లను తీసుకొని లాల్ పహాడ్ నుంచి చౌదర్ గూడకు గురువారం ఆటో బయలుదేరింది. 

మార్గమధ్యలో తుమ్మలపల్లి గేటు వద్ద ఓవర్​లోడ్​తో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో తుమ్మలపల్లి గ్రామానికి చెందిన జంగయ్య (65) స్పాట్​లోనే మృతి చెందగా, ఆటోలో ప్రయాణిస్తున్న మరో 9 మంది గాయపడ్డారు. వీరిని ట్రీట్మెంట్ కోసం షాద్ నగర్ దవాఖానకు తరలించారు. ఆటో డ్రైవర్ పరారీ ఉండగా, పోలీసులు కేసు నమోదు చేశారు.