ఆటో బంద్​కు మద్దతు ఇవ్వాలి

ఆటో బంద్​కు మద్దతు ఇవ్వాలి

హైదరాబాద్​సిటీ, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​చేస్తూ ఈ నెల 7న  ఆటో బంద్​నిర్వహిస్తున్నామని, మద్దతు ఇవ్వాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్​యూనియన్స్​జేఏసీ నాయకులు ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును కోరారు. సోమవారం ఆయనను కలిసి వినతిపత్రం ఇచ్చారు. వారిలో ఆటో సంఘాల నాయకులు బి.వెంకటేశం, వి.మారయ్య, వి.ప్రవీణ్​, ఎ.సత్తిరెడ్డి, శ్రీకాంత్, ఉమర్​ఖాన్​ తదితరులు ఉన్నారు.