ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో కార్మికుల ధర్నా

ముదిగొండ, వెలుగు : ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేస్తూ మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్​ సెంటర్​లో ఆటో యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు. అక్కడ నుంచి తహసీల్దార్​ ఆఫీస్ వరకు ప్రదర్శనగా వెళ్లి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్ టీఎస్ కళ్యాణ్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్ సౌకర్యంతో ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని, కల్లుగీత,  చేనేత, బీడీ కార్మికులకు ఆర్థిక తోడ్పాటు ఇస్తున్నట్లుగా ఆటోడ్రైవర్లు కూడా నెలవారీ ఇచ్చి ఆదుకోవాలని కోరారు. 

ఆటో రంగ కార్మికులందరికీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఆటో ఫైనాన్స్ కిస్తీలు కూడా మూడు నెలలు సమయం కల్పించాలన్నారు.  ఆటో కార్మికులకు ఇండ్ల స్థలాలు, గృహ నిర్మాణం కోసం ప్రభుత్వ పథకంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, మండల వైస్ ప్రెసిడెంట్ మంకెన దామోదర్, సీపీఎం నాయకుడు మర్లపాటి  వెంకటేశ్వర్లు, మండల ఆటో యూనియన్ ప్రెసిడెంట్ బట్టు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.