
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) శరవేగంగా విస్తరిస్తోంది. బిగ్ డేటా, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి టెక్నాలజీల్లో స్పెషలిస్ట్‌లకు భారీగా డిమాండ్ ఉంది. చాలా కంపెనీలు ఈ టెక్నాలజీలను వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి. ఆటోమేషన్ కారణంగా తమ ఉద్యోగులను తగ్గించుకుంటామని 41శాతం కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ఆటోడెస్క్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ అన్నంత పని చేసింది. ఏఐపై ఇన్వెస్ట్ చేసేందుకు 1,350 మంది ఉద్యోగులను ఈ సంస్థ ఉద్యోగాల నుంచి తొలగించాలని డిసైడ్ అయింది. ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఈ ఆటోడెస్క్ అనే సంస్థ ఐటీ సేవలను అందిస్తుంది.
1,350 మంది ఉద్యోగులను జాబ్స్ నుంచి తొలగించి 9 శాతం ఉద్యోగులకు చెల్లిస్తున్న జీతాన్ని మిగుల్చుకోవాలని భావిస్తోంది. ఇలా మిగిలిన సొమ్మును ఏఐపై ఇన్వెస్ట్ చేయాలని ఈ ఆటోడెస్క్ సాఫ్ట్ వేర్ సంస్థ భావిస్తున్నట్లు తెలిసింది. ఏఐపై మరింత దృష్టి పెట్టనున్నట్లు ఈ కంపెనీ తాజాగా ప్రకటించింది కూడా. జాబ్స్‌కు అవసరమయ్యే స్కిల్స్ ఎప్పటికప్పుడు మారుతుండడంతో ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారు. ఏఐ, బిగ్‌డేటా, సైబర్ సెక్యూరిటీస్ వంటి టెక్నాలజీ స్కిల్స్ ఉన్నవారికి ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. కానీ, క్రియేటివ్ థింకింగ్, ఫ్లెక్సిబిలిటీ వంటి హ్యూమన్ స్కిల్స్ కూడా చాలా కీలకంగా ఉన్నాయి.
Also Read:-100 కోట్ల మంది దగ్గర ఖర్చులకు పైసల్లేవ్..
జాబ్ మార్కెట్‌లో భారీ మార్పులు రావడానికి కారణం టెక్నాలజీ అడ్వాన్స్ కావడమే. దీనికి తోడు గ్లోబల్‌గా నెలకొన్న సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వివిధ ప్రాంతాల్లో మారుతున్న అలవాట్లు వంటివి జాబ్ మార్కెట్‌లో పెద్ద మార్పులు తీసుకొస్తున్నాయి. ఏఐ టెక్నాలజీ ముఖ్యంగా బ్రెయిన్‌వర్క్‌ను తగ్గిస్తుంది. మనుషుల పనులను షెడ్యూల్ చేయడం, ఐడియాల ఆర్గనైజ్, ప్రాజెక్ట్స్ రూపొందించడం లాంటివన్నీ ఏఐకి అప్పగించడం వల్ల హ్యూమన్ స్కిల్స్ వాడాల్సిన అవసరం కాస్త తగ్గుతుంది. కాబట్టి ప్రోగ్రామింగ్ మెషిన్‌ల కంటే మనుషులు క్రియేటివిటీని పెంచుకోవాలి. కొత్త ఆలోచనల అన్వేషణ మొదలుపెట్టాలి. అలాగైతేనే.. మనుగడ సాధ్యమవుతుంది. లేదంటే మన స్థానంలోకి ఏఐ టెక్నాలజీ వచ్చి చేరుతుంది.