డిసెంబర్​ 7న ఆటోల బంద్

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆటో జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 7న నిర్వహించనున్న ఆటో బంద్ విజయవంతం చేయాలని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య  పిలుపునిచ్చారు. నాచారంలోని హెచ్ఎంటీ నగర్​లోని సిటీ ఆఫీసులో ఆదివారం ఆటో బంద్ పోస్టర్​ను విడుదల చేశారు. టీఏడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, టీయూసీఐ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు లింగం గౌడ్ పాల్గొన్నారు.