ఆటోమేకర్​ ఇసుజు మోటార్స్ నుంచి ఐకేర్​ క్యాంప్స్

ఆటోమేకర్​ ఇసుజు మోటార్స్ నుంచి ఐకేర్​ క్యాంప్స్

హైదరాబాద్​, వెలుగు:  ఆటోమేకర్​ ఇసుజు మోటార్స్ దేశమంతటా 'ఇసుజు ఐ-కేర్ మాన్‌‌‌‌‌‌‌‌సూన్ క్యాంప్‌‌‌‌‌‌‌‌'ని ప్రారంభించనుంది. ఈ నెల 22 నుంచి 28 వరకు అన్ని ఇసుజు డీలర్, సర్వీస్ ఔట్‌‌‌‌‌‌‌‌లెట్లలో కస్టమర్‌‌‌‌‌‌‌‌లు సర్వీస్ ప్రయోజనాలను పొందవచ్చు.

ఈ సందర్భంగా కస్టమర్లు తమ వాహనాలకు ప్రత్యేక ఆఫర్లు, ప్రయోజనాలను కూడా పొందవచ్చు. - ఐ-కేర్ మాన్‌‌‌‌‌‌‌‌సూన్ క్యాంప్‌‌‌‌‌‌‌‌లో వాహనాలకు ఉచిత 37-పాయింట్ సమగ్ర తనిఖీ ఉంటుంది. 

- లేబర్‌‌‌‌‌‌‌‌ చార్జీలపై 10శాతం, విడిభాగాలపై 5శాతం తగ్గింపు ఇస్తారు.

లూబ్స్, ఫ్లూయిడ్స్‌‌‌‌‌‌‌‌పై 5శాతం డిస్కౌంట్​ పొందవచ్చు.

రిటైల్ ఆర్​ఎస్​ఏ కొనుగోలుపై 10శాతం తగ్గింపు దక్కించుకోవచ్చని ఇసుజు తెలిపింది.