రికార్డుస్థాయిలో వాహన అమ్మకాలు

  •     ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో 3,35,629 బండ్ల అమ్మకం
  •     వెల్లడించిన సియామ్​  

న్యూఢిల్లీ: యుటిలిటీ వాహనాలకు బలమైన డిమాండ్‌‌‌‌‌‌‌‌తో ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో భారతదేశంలో ప్యాసింజర్ వాహనాల టోకు విక్రయాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని ఆటోమొబైల్ ఇండస్ట్రీ సంస్థ సియామ్ మంగళవారం తెలిపింది. కంపెనీల నుంచి డీలర్‌‌‌‌‌‌‌‌లకు మొత్తం ప్యాసింజర్ వాహనాల పంపకాలు (డిస్పాచ్​లు)  2023 ఏప్రిల్లో 3,31,278 యూనిట్లతో పోలిస్తే, ఈసారి ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో రికార్డు స్థాయిలో 1.3 శాతం పెరిగి 3,35,629 యూనిట్లకు చేరుకున్నాయి. యుటిలిటీ వాహన విక్రయాలు గత నెలలో 1,48,005 యూనిట్ల నుంచి వార్షికంగా 21 శాతం వృద్ధితో 1,79,329 యూనిట్లుగా ఉన్నాయి. 

అయితే ప్యాసింజర్ కార్ల పంపకాలు ఏప్రిల్ 2023లో 1,25,758 యూనిట్లతో పోలిస్తే 23 శాతం తగ్గి 96,357 యూనిట్లకు పడిపోయాయి. వ్యాన్ల విక్రయాలు గతేడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో 10,508 యూనిట్ల నుంచి  15 శాతం పెరిగి 12,060 యూనిట్లకు చేరుకున్నాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్​) విడుదల చేసిన డేటా ప్రకారం, గత ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో 13,38,588 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో టూవీలర్​ టోకు అమ్మకాలు 31 శాతం పెరిగి 17,51,393 యూనిట్లకు చేరుకున్నాయి. 

మోటార్‌‌‌‌‌‌‌‌ సైకిల్ హోల్‌‌‌‌‌‌‌‌సేల్‌‌‌‌‌‌‌‌లు గత నెలలో 8,39,274 యూనిట్ల నుంచి 34 శాతం వృద్ధితో 11,28,192 యూనిట్లుగా ఉన్నాయి. స్కూటర్‌‌‌‌‌‌‌‌ హోల్‌‌‌‌‌‌‌‌సేల్స్‌‌‌‌‌‌‌‌ గత ఏడాది ఇదే నెలలో 4,64,389 యూనిట్ల నుంచి ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో 25 శాతం పెరిగి 5,81,277 యూనిట్లకు చేరుకున్నాయి. ఏప్రిల్ 2023లో 42,885 యూనిట్ల నుంచి త్రీవీలర్ హోల్‌‌‌‌‌‌‌‌సేల్స్ గత నెలలో 14.5 శాతం పెరిగి 49,116 యూనిట్లకు చేరుకున్నాయని సియామ్​ తెలిపింది.