న్యూఢిల్లీ: ఆటో మొబైల్ రిటైల్ సేల్స్ అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే గత ఏడాది తొమ్మిది శాతం పెరిగాయి. ప్యాసింజర్ వెహికల్స్కు, టూవీలర్లకు గిరాకీ పెరిగిందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) తెలిపింది. గత ఏడాది మొత్తం 2,61,07,679 యూనిట్లు అమ్ముడు కాగా, 2023లో 2,39,28,293 యూనిట్లు సేల్ అయ్యాయి. వడగాల్పులు, ఎన్నికలు వంటి సమస్యలు వచ్చినా గిరాకీ మాత్రం తగ్గలేదని ఫాడా ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ చెప్పారు.
కమర్షియల్ వెహికల్స్కు మాత్రమే డిమాండ్ తగ్గిందని అన్నారు. ఈసారి పీవీ సేల్స్ఐదు శాతం పెరిగి40,73,843 యూనిట్లకు చేరుకున్నాయి. టూవీలర్ సేల్స్ 11 శాతం పెరిగి 1,89,12,959 యూనిట్లకు పెరిగాయి. త్రీవీలర్ రిజిస్ట్రేషన్లు 11 శాతం పెరిగి12,21,909 యూనిట్లకు చేరాయి. ట్రాక్టర్ సేల్స్ మూడుశాతం పెరిగి 8,94,112 యూనిట్లకు ఎగిశాయని ఫాడా తెలిపింది.