Viral news: రోడ్డుపైనా, నీటిలో నడిచే ఎలక్ట్రిక్ వెహికల్ ‘క్రాసర్’

Viral news: రోడ్డుపైనా, నీటిలో నడిచే ఎలక్ట్రిక్ వెహికల్ ‘క్రాసర్’

సాధారణంగా మనం రోడ్డుపై నడిచే వాహనాలు, నీటిపై నడిచే పడవలు, గాల్లో నడిచే విమనాలు ఇవి మాత్రం చూశాం. అయితే ఇప్పుడు రోడ్డుపైనా, నీటిలో నడిచే వాహనాలు కూడా వస్తున్నాయి. భూమిపైనా, నీటిలో నడిచే ఓ కారులాంటి ఎలక్ట్రిక్ వాహనం తయారు చేశారు. దీనిపేరు క్రాసర్.. ఇది చూడటానికి ఓబాక్స్ మాదిరిగా ఉంటుంది. ఇది స్వయంగా నడిచే వాహనం.. ఇందులో నలుగురు ప్రయాణించవచ్చు. 

ట్రాఫిక ఎక్కువగా ఉన్న సమయంలో నీటిలో కూడా ప్రయాణించేందుకు బొర్నార్డో పెరీరా అనే డిజైనర్ దీనిని డిజైన్ చేశారు. ఇది 2024 ఫిబ్రవరిలో మొదటి సారి దీని నమూనా బయటికి వచ్చింది.. ఇప్పుడిది టెస్టింగ్ దశలో ఉంది. 

క్రాసర్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ వెహికల్. దీని ఇంటీరియల్ డిజైన అద్భుతంగా విశాలంగా ఉంటుంది. ఇరువైను రెండు సీట్ల చొప్పున, మధ్యలో తగినంత ప్లేస్, మంచి సౌండ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. దీని డోర్స్ కూడా అటోమేటిక్. ఈ కారును బుక్ చేసుకున్న వారు మాత్రమే డోర్ ఓపెన్ చేయగలరు. బుక్ చేసుకున్న వారు తప్పా.. ఇతరులు ఈ కారులోకి ఎంటర్ కాలేరు. 

ఈ కారు డ్రైవర్ లెస్ కారు.. రోడ్డుమీద, నీటిలో ప్రయాణించేందుకు అవసరమైన కెమెరాలు,  సెన్సా్ర్లతో ఉంటుంది. స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ కారు డోర్స్ ను ఓపెన్ చేయొచ్చు. బుక్ చేసుకున్న వారు కారు డోర్ మీదున్న ఎల్ ఈడీ స్క్రీన్ దగ్గర ఉంచినప్పుడు డోర్స్ ఓపెన్ అవుతాయి. 

భూమ్మీద నుంచి నీటిలోకి వెళ్లేటప్పుడు.. ఈ కారు నెమ్మదిగా దిగుతుంది. నీటిలో ప్రయాణించడానికి అనుకూలంగా దాని చక్రాలు 30 డిగ్రీలు తిరుగుతాయి. మళ్ళీ రోడ్డుపైకి వెళ్లాలంటే తిరిగి యథాస్థితికి అనుగుణంగా మారిపోతాయి. మొత్తం మీద దీనిని రోడ్డుపైన, నీటిపైన వెళ్ళడానికి సరిపోయే విధంగా రూపొందించారు.

ఈ కారులో ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ప్రయాణీకులందరూ తమ సీట్ బెల్టులు పెట్టుకోకపోతే వాహనం కూడా స్టార్ట్ కాదు.ఇందులో నీటి చోదకానికి హైడ్రోజెట్‌ లు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో నిలిపివేసేందుకు ప్రతి ప్రయాణీకుడికి వారి సీటు పైన ఉన్న 'స్టాప్' బటన్ యాక్సెస్ ఉంటుంది. డోర్ మీద స్క్రీన్ కెమెరాలు,సెన్సార్లు ఉంటాయి.. వీటిద్వారా అపరేట్ చేయబడుతుంది.