హైదరాబాద్, వెలుగు : ఆక్సిలో ఫిన్‌సర్వ్ రాబోయే 5 సంవత్సరాలలో భారతదేశం అంతటా పది వేల ఎడ్యుకేషనల్ఇన్స్టిట్యూట్లకు లోన్లు ఇస్తామని ప్రకటించింది. సామర్థ్య పెంపుదల, భవనాల విస్తరణ, భూమి కొనుగోలు, బోధనా సౌకర్యాల ఆధునీకరణ వంటి అవసరాలను తీర్చడానికి అన్ని రకాల విద్యాసంస్థలకు అప్పులు ఇస్తుంది. ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ లోన్ వ్యాపారం గురించి ఆక్సిలో ఫిన్ సర్వ్ సీఈఓ నీరజ్ సక్సేనా మాట్లాడుతూ తాము 2018 నుంచి లోన్లు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
కర్ణాటక తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మరో తొమ్మిది రాష్ట్రాలకు సేవలు విస్తరించనుంది. ఈ ఏడాది జులైలో కంపెనీ తన వాటాదారు ఐసిఐసిఐ బ్యాంక్‌తో పాటు టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్, ట్రిఫెక్టా లీడర్స్ ఫండ్, ఎక్స్‌పోనెన్షియా ఆపర్చునిటీస్ ఫండ్ నుంచిరూ. 470 కోట్లను సేకరించింది. 2020–-23 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నిర్వహణ కింద రూ.2,500 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇవి 52.7 శాతం సీఏజీఆర్‌తో వృద్ధి చెందాయి.