ఎన్నికల్లో అవధ్ గడ్డపై ఎగిరేది ఎవరి జెండా.?

ఎన్నికల్లో అవధ్ గడ్డపై ఎగిరేది ఎవరి జెండా.?

అవధ్ ఉత్తరప్రదేశ్ లో ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం.ఎంతో మంది ప్రముఖులను దేశ, రాష్ట్ర రాజకీయాలకు అందించిన నేల ఇది.కీలకమైన ఈ ప్రాంతం ప్రస్తుతం కులరాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గామారింది. నవాబుల కల్చర్ కు అద్దం పట్టేఅవధ్ ఈసారి ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతోంది ? బీసీలు,దళితులనుఎస్పీ, బీఎస్పీ,ఆర్ ఎల్డీ కూటమి తమవైపునకు తిప్పుకుంటుందా ?సంప్రదాయంగా బీజేపీ కి అండగా నిలిచే పెద్దకులాల వైఖరిలో మార్పుఏమైనా వచ్చిందా ? అవధ్ ప్రాంతం పైఎవరి జెండా ఎగరబోతోంది ?

ఉత్తరప్రదేశ్ కు గుండెకాయ వంటి అవధ్ ప్రాంతాన్ని ఇప్పుడు కులాల లెక్కలే శాసిస్తున్నాయి. దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఉన్నఅన్ని సమస్యలు ఇక్కడ కూడా ఉన్నాయి.కొలువుల్లేని చదువుకున్న కుర్రాళ్లు ఉన్నారు.పండించిన పంటకు పెట్టుబడి కూడా రాక నానా కష్టాలు పడుతున్న రైతులున్నారు.పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలతో దెబ్బ తిన్న చిన్నా చితకా వ్యాపారులున్నారు.వీటన్నిటికంటే కులాల లెక్కలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీకి అనుకూలంగా గాలి వీయడం లేదంటున్నారు రాజకీయవిశ్లేషకులు. ఉజ్వల యోజన, అన్ని ఇళ్లకూకరెంటు, దేశ భద్రత వంటి ఇష్యూలేవీ ఇక్కడ ఎన్నికల అంశాలు కావన్నది రాజకీయపండితుల అభిప్రాయం. బీసీలు, దళితులుఎటు వైపు మొగ్గుతారన్నదే ఎవరికీ అర్థం కానివిషయం. దీనిపై ఎవరి అంచనాలు వారికున్నాయి. బీసీల్లో యాదవేతరులు, దళితుల్లో జాతవేతరుల ఓట్లే అవధ్ ప్రాంతంలో ఈసారి కీలకంకానున్నాయి. అవధ్ పరిధిలో మొత్తం 18 లోక్ సభ నియోజకవర్గాలున్నాయి. వీటిలో బీసీలు,దళితుల ప్రాబల్యం ఉన్న మూడుసెగ్మెంట్లలో కులాల లెక్కలే కీలకంకానున్నాయి.

ఫైజాబాద్

మే6న పోలింగ్ జరిగే ఈ నియోజకవర్గంనుంచి బీజేపీ టికెట్ పై సిట్టింగ్ ఎంపీ లల్లూ సింగ్ పోటీ చేస్తున్నారు. సమాజ్ వాది పార్టీ తరఫునఆనందసేన్ యాదవ్, కాం గ్రెస్ తరఫున నిర్మల్ఖత్రి పోటీలో ఉన్నారు. కిందటిసారి ఎన్ని కల్లోబీజేపీ 48 శాతం ఓట్లు తెచ్చుకుంది. కాంగ్రెస్ కేవలం 13 శాతం ఓట్ షేర్ తోనే సరిపెట్టుకోవాల్సి  వచ్చింది. ఎస్పీ కేండిడేట్ గా పోటీ చేస్తున్నఆనందసేన్ యాదవ్, మాజీ ఎంపీ మిత్రసేన్యాదవ్ కుమారుడు. మిత్రసేన్ 2007 లో అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు.తర్వాత మాయావతికేబినెట్ లో మంత్రిగా కూడా చేశారు. అయితే దళితుల్లో ‘పాసీ’ ఉపకులానికి చెందిన ఒక అమ్మాయిని రేప్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ట్రయల్ కోర్టు ఆయనను దోషిగా నిర్థారిం చడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. హైకోర్టుకు అప్పీల్ చేసుకుంటే ఆయనపై కేసు కొట్టేసింది. అయితే ఈ సంఘటనను ‘పాసీ’ కులస్తులు మరచిపోలేదు.దీంతో ఎస్పీ కేండిడేట్ ఆనందసేన్ కు తండ్రిఎపిసోడ్ ఒక మైనస్ పాయింట్ గా మారింది.మిత్రసేన్ కుమారుడికి టికెట్ ఇవ్వడం పై పాసీ కమ్యూనిటీలో రగిలిన అసంతృప్తిని తమకు అనుకూలంగా మరల్చుకోవడానికి బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఫ్రూట్ బిజినెస్ చేసే ఖటిక కులస్తులు కూడా సెగ్మెంట్ లో పెద్ద సంఖ్యలో ఉన్నారు.ఫైజాబాద్ పట్టణంలో వీరు ఎక్కువగా ఉంటారు.అలాగే ఫైజాబాద్ ముస్లిం లు ఎక్కువమంది ఫ్రూట్ బిజినెస్ మీదే బతుకుతుంటారు. ఈ వ్యాపారం విషయంలో ఖటిక కులస్తులకు, ముస్లింలకు మధ్య గొడవలున్నాయి. ముస్లింలు బీజేపీకి వ్యతిరేక వైఖరి తీసుకుంటే. ఖటిక కులస్తులు బీజేపీకి అనుకూలంగా ఓటు చేసే అవకాశాలున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.

సుల్తాన్ పూర్

కేంద్రమంత్రి మేనకా గాంధీ పోటీ చేస్తున్న సుల్తాన్ పూర్ నియోజకవర్గంలో మే 12న పోలింగ్ జరుగుతుంది. 2014 లో బీజేపీ తరఫున మేనకా  గాంధీ కొడుకు వరుణ్ గాంధీ ఇక్కడ నుంచి పోటీ చేసిగెలిచారు. ఈ సారి వరుణ్ ను పిల్ భిత్ కు పంపి మేనకకు బీజేపీ టికెట్ ఇచ్చింది. కాం గ్రెస్ తరఫున సంజయ్ సింగ్, బహుజన్ సమాజ్ పార్టీ టికెట్ పై చంద్ర భద్ర సింగ్ పోటీలో ఉన్నారు. కిందటిసారిఎన్ని కల్లో బీజేపీకి 43 శాతం ఓట్ షేర్ వచ్చింది.కాంగ్రెస్ కు కేవలం నాలుగు శాతం ఓట్ షేరే దక్కింది. ఎస్పీ, బీఎస్పీ వేర్వేరుగా పోటీ చేసినప్పటికీకంబైన్డ్ ఓట్ షేర్ 46 శాతం గా నమోదైంది. సుల్తాన్ పూర్  లోక్ సభ నియోజకవర్గంలో 50 వేలకుపైగా బీసీలు ఉన్నారు. వీరిలో లోహార్, బహధాయ్ తదితర కులాలున్నాయి. ఒకప్పుడు ఎస్పీ, బీఎస్పీకిఓటు బ్యాంకుగా ఉన్న ఈ కులాలు మారిన రాజకీయ పరిస్థితుల్లో తమ వైఖరిని మార్చుకున్నట్లు రాజకీయ పండితులు చెబుతున్నారు. సమాజ్ వాది పార్టీకేవలం యాదవుల సంక్షేమాన్నే పట్టించుకుంటుం-దని మిగతా బీసీ కులాలు ఫీలవుతున్నట్లు రాజకీయవిశ్లేషకులు చెబుతున్నారు. అలాగే బహుజన్ సమాజ్ పార్టీ కూడా దళితుల్లో కేవలం జాతవ్ కులానికే పరిమితమవుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి.దళితుల ఓట్లతో పాటు నియోజకవర్గంలోని పెద్దకులమైన ఠాకూర్లను కూడా తమ వైపునకు తిప్పుకోవడంలో భాగంగా యువ ఠాకూర్ చంద్ర భద్ర సింగ్ కు బీఎస్పీ వ్యూహాత్మకంగా టికెట్ ఇచ్చింది. అయితేనాన్ జాతవ్ దళితుల్లో బహుజన్ సమాజ్ పార్టీ పై అసంతృప్తి ఉందన్నది రాజకీయ వర్గాల సమాచారం.దీనిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ పక్కా ప్రణాళికతో ముందుకు పోతోంది.మేనకా గాంధీకి వ్యక్తిగతంగా ఉన్న పలుకుబడికూడా ప్లస్ పాయింట్ గా మారిం ది. మొత్తం మీద నాన్ యాదవ్ బీసీలు, నాన్ జాతవ్ దళితులు ఈ సారి అవధ్ రాజకీయాలను శాసిస్తున్నారు.

బరాబంకీ

షెడ్యూల్డ్ కులాలకు రిజర్వు చేసిన ఈ నియోజకవర్గంలో మే ఆరో తేదీన పోలింగ్ జరగబోతోంది.బీజేపీకి చెందిన ప్రియాంక సింగ్ రావత్ ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే ఈ సారిప్రియాంక సింగ్ కు టికెట్ లభించలేదు. జైద్పూర్ ఎమ్మెల్యేగా ఉన్న ఉపేంద్ర రావత్ కు ఈ సారి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కూటమిలో భాగంగా సమాజ్ వాది పార్టీ టికెట్ పై రామ్ సాగర్ రావత్ పోటీలో ఉన్నారు.కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ పీఎల్ పూనియా కుమారుడు తనూజ్ పూనియా బరిలో ఉన్నారు.2014 ఎన్ని కల్లో బీజేపీకి 43శాతం ఓట్లువచ్చాయి. 22 శాతం ఓట్లు తెచ్చుకుని కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఎస్పీ,బీఎస్పీ ఆ ఎన్నికల్లో విడివిడిగా పోటీచేసినా, కంబైన్డ్ ఓట్ షే ర్ 29 శాతం ఉంది.యాదవులు, జాతవ్ఓట్ల పై సమాజ్వాది పార్టీ ఆశలు పెట్టుకుం ది. ఈ సెగ్మెంట్లో బీసీ వర్గానికి చెందిన కుర్మీలు 10 శాతానికిపైగా ఉన్నారు. వీరికి ముస్లిం ల ఓట్లు కూడాతోడయితే ఎస్పీ కేం డిడేట్ కు విజయావకాశాలుమెరుగుపడతాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దళితుల్లో ని ‘ పాసీ’ ఉప కులస్తులు కూడాబారాబంకీలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎస్పీకేం డిడేట్ రామ్ సాగర్ రావత్, బీజేపీ అభ్యర్థిఉపేంద్ర రావత్ ఇద్దరూ పాసీ కులస్తులే. బీసీల్లోయాదవేతరులు, దళితుల్ లో జాతవేతరులు, అలాగేపెద్ద కులాలైన బ్రాహ్మణ, బనియా, ఠాకూర్ లపైబీజేపీ ఆశలు పెట్టుకుం ది.ఇక ముస్లిం ల విషయానికొస్తే బీజేపీని ఓడిం చే సత్తా ఎవరికుం టేవారికి అనుకూల వైఖరి తీసుకునే ఆలోచనలోఉన్నట్లు రాజకీయ వర్గాల సమాచారం.కాం గ్రెస్ కంటే ఎస్పీ, బీఎస్పీ, ఆర్ ఎల్డీకూటమివైపే మొగ్గు చూపే అవకాశాలు న్నాయంటున్నారు రాజకీయ పండితులు.