
సిద్దిపేట టౌన్, వెలుగు: ఎల్ఆర్ఎస్ రుసుముపై 25 శాతం రాయితీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. మంగళవారం మున్సిపల్ ఆఫీస్లో వార్డు ఆఫీసర్లు, ఆర్పీలతో సమావేశమయ్యారు. ఆమె మాట్లాడుతూ.. 2020లో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాట్యజమానులు ఈ నెల 31లోగా పూర్తి ఫీజు చెల్లించాలని సూచించారు. ఏమైనా సందేహాలుంటే హెల్ప్ లైన్ నంబర్ 9505507248 లో సంప్రదించాలని చెప్పారు.
బ్యాంకర్లు లక్ష్యాలను సాధించాలి
కలెక్టరేట్ లో బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన త్రైమాసిక డీసీసీ, డీఎల్ఆర్ సీ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడారు. ముద్ర లోన్ సహా అన్ని పథకాలు, కార్యక్రమాల అమలులో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో బ్యాంకర్లు, అధికారులు సమష్టిగా పని చేయాలని సూచించారు.
జిల్లాలో మంజూరైన ఋణాల వివరాలను ఎప్పటికప్పడు ఆన్ లైన్ చేయాలని, పౌల్ట్రీ, గొర్రెల పెంపకం తదితరాలపై దృష్టి సారించాలని చెప్పారు. ఎల్డీఎం హరిబాబు, డీఆర్డీవో జయదేవ్ ఆర్యా, నాబార్డ్ డీడీఎం నిఖిల్, యూబీఐఆర్ ఎం.వికాస్, జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక, పరిశ్రమలు, మత్స్య శాఖల జిల్లా అధికారులు, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు