ఖానాపూర్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపించాలని, ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తానని బీఆర్ఎస్ ఖానాపూర్ అభ్యర్థి భూక్య జాన్సన్ నాయక్ అన్నారు. మంగళవారం ఉట్నూర్ మండలం బిర్సాయిపేట, దంతన్ పల్లి, నర్సాపూర్(జే), కొత్తగూడ, రాజుగూడ, యేంద, జైత్రం తాండ తదితర గ్రామాల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్సన్ నాయక్ కు స్థానికులు ఘన స్వాగతం పలికారు.
వేర్వేరుగా జరిగిన కార్యక్రమాలలో ఆయన పాల్గొని మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారం కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తనను గెలిపిస్తే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులతో పాటు విద్య, వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువయ్యేలా చూస్తానని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తేవడానికి ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్ర మంలో అదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఉట్నూర్ చారులత రాథోడ్ తదితరులు ఉన్నారు.
యాదవులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్సీ దండె విఠల్
యాదవ కులస్తులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. మంగళవారం ఖానాపూర్ పట్టణంలో యాదవ కులస్తులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. జా న్సన్ నాయక్‌కు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
జాన్సన్‌నాయక్‌కు మద్దతుగా సినీ నటుల ప్రచారం
జన్నారం: ఖానాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్‌కు మద్దతుగా తెలంగాణ సినీ తారలు మంగళవారం జన్నారంలో ప్రచారం నిర్వహించారు. యజ్ఞం సినిమాలో విలన్‌గా నటించిన విజయ్ గంగరాజు, రియల్ స్టార్ సినిమా హీరో అప్సర్ ఆజాద్, నిర్మాత రాజశేఖర్, ఎన్ఆర్ఐ బాలరాజు గౌడ్ కారు గుర్తుకు ఓటేయాలని ప్రచారం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, మరోసారి కేసీఆర్ నాయకత్వం రాష్ట్రానికి అవసరముందన్నారు. వారి వెంట ఎంపీపీ మాదాడి సరోజన, జడ్పీటీసీ ఎర్ర
చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ వినయ్ కుమార్, బీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ రాజారాంరెడ్డి, పార్టీ నాయకులు భరత్ కుమార్, మున్వర్ ఆలీఖాన్, జనార్దన్, శ్రీనివాస్ గౌడ్ తదితరులున్నారు.
ALSO READ : కుటుంబమంతా కలిసి చూసేలా.. మాధవే మధుసూదన