
Avanti Feeds Stock: ఈ నెల ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలను తన టారిఫ్స్ ప్రకటనతో వణికించారు. ఈ క్రమంలో ఇండియాపై కూడా 26 శాతం వరకు సుంకాలను ప్రకటించారు. అయితే దీనివల్ల ఎక్కువగా ఆందోళన చెందిన వారిలో ఆక్వా రైతులు కూడా ఉన్నారు. టారిఫ్స్ కారణంగా రొయ్యల పెంపకం రంగంలోని సంస్థలు భారీగానే ప్రభావితం అయ్యాయి. అయితే ఆ తర్వాత టారిఫ్స్ 90 రోజుల వరకు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటన ఈ రంగంలోని లిస్టెడ్ కంపెనీల షేర్లు తిరిగి ఊపిరి పీల్చుకుంటున్నాయి.
తాజాగా ట్రంప్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటంతో స్మాల్ క్యాప్ కంపెనీ అయిన అవంతీ ఫీడ్స్ షేర్లు తిరిగి పుంజుకోవటం ప్రారంభించాయి. ఏప్రిల్ 7న రూ.601 స్థాయికి పడిపోయిన కంపెనీ షేర్లు.. గడచిన ఆరు ట్రేడింగ్ సెషన్లలో తిరిగి పుంజుకున్నాయి. ఈ క్రమంలో స్టాక్ ఏకంగా 46 శాతం పెరిగి నేడు తన ప్రయాణాన్ని రూ.864 వద్ద ఎన్ఎస్ఈలో ముగించింది. అయితే నేడు ఇంట్రాడేలో కంపెనీ షేర్లు ఒక్కోటి అత్యధికంగా రూ.876కి పెరిగాయి. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.11వేల 770 కోట్లుగా ఉంది.
2024 ఆర్థిక సంవత్సరం కంపెనీ షేర్లు తన ఇన్వెస్టర్లకు దాదాపు 62 శాతానికి పైగా రాబడిని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ట్రంప్ ప్రకటించిన టారిఫ్స్ హాల్ట్ ఉపశమనం ప్రకారం రొయ్యల ఎగుమతిదారులు 35 నుంచి 40వేల టన్నుల రొయ్యలను అమెరికాకు ఎగుమతి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆక్వా రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ట్రంప్ టారిఫ్స్ బ్రేక్ ప్రకటనతో దాదాపు పెండింగ్ లో ఉన్న 2వేల కంటైనర్ల రొయ్యలను అమెరికా పంపేందుకు సిద్ధం చేస్తున్నట్లు ఇండియన్ సీఫుడ్ ఎక్స్‌పోర్ట్స్ సంఘం ప్రధాన కార్యదర్శి రాఘవన్ వెల్లడించారు. అమెరికాకు భారత రొయ్యల ఎగుమతులు ప్రస్తుతం 17.7 శాతం వరకు కస్టమ్స్ సుంకానికి గురవుతున్నాయి. ఇందులో 5.7 శాతం కౌంటర్ వెయిలింగ్ టారిఫ్ కాగా 1.8 శాతం యాంటీ-డంపింగ్ సుంకం కూడా కలిగి ఉంది. అమెరికాకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇండియా నుంచి కేవలం రొయ్యల ఎగుమతుల విలువ రూ.22వేల కోట్ల వకరు ఉందని గణాంకాలు ప్రకారం వెల్లడైంది. లక్ష్మీ శ్రీ ఇన్వెస్ట్‌మెంట్ & సెక్యూరిటీస్‌లో రీసెర్చ్ హెడ్ అన్షుల్ జైన్, అవంతి ఫీడ్స్ షేర్లకు రూ.1,050 టార్గెట్ ధరను ప్రకటించారు.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.