43.5 కోట్ల మంది డేటా అమ్మేసుకున్న కంపెనీ

43.5 కోట్ల మంది డేటా అమ్మేసుకున్న కంపెనీ

అవస్త్‌తో ​అవస్థలే

మదర్​బోర్డ్​, పీసీమ్యాగ్​ సంస్థల స్టడీలో వెల్లడి

కంప్యూటర్లు, ఫోన్లను వైరస్​ దాడి నుంచి కాపాడేవి యాంటీ వైరస్​లు. కానీ, ఆ యాంటీ వైరస్​ కంపెనీలే మన డేటాను అమ్మేసుకుంటే..? అదే జరిగిందని తేలింది మదర్​బోర్డు, పీసీమ్యాగ్​ అనే రెండు కంపెనీల స్టడీలో. అవును, అవస్త్​ అనే యాంటీ వైరస్​ సంస్థ తన కస్టమర్ల డేటా అమ్ముకుంటున్నట్టు తేలింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 43.5 కోట్ల మంది అవస్త్​ యూజర్ల డేటా మైక్రోసాఫ్ట్​, గూగుల్​, హోమ్​ డిపో, పెప్సీ వంటి కంపెనీల చేతికి వెళ్లిందని తేలింది. అవే కాదు, చాలా చిన్నాపెద్దా కంపెనీలకు  జంప్​షాట్ అనే సబ్సిడరీతో ఆ వివరాలు ఇచ్చినట్టు తేలింది. ఎప్పుడెప్పుడు ఏమేం చేశారు, ఏం చూశారు, ఏయే లొకేషన్​లో ఉన్నారు వంటి వివరాలన్నింటినీ అవస్త్​ బేరం పెట్టేసిందట. అంతేకాదు, పోర్న్​వెబ్​సైట్స్​ చూసిన డేటా కూడా వాటికిచ్చేసిందట. లాగిన్​ టైం, సైట్​ చూసిన టైం, చూసిన వీడియోలు, ఆయా సైట్లలో యూజర్లు అడిగిన ప్రశ్నల వంటి వివరాలూ కంపెనీల చేతుల్లోకి పోయాయట. అయితే, యూజర్​ పేర్లను మాత్రం కంపెనీలకు ఇవ్వలేదని చెబుతున్నారు. వాళ్లకు ఇచ్చిన డేటాతో యూజర్​ ఎవరన్నది ఈజీగా తెలుసుకోవచ్చని కొందరు సైబర్​ నిపుణులు చెబుతున్నారు. న్యూయార్క్​కు చెందిన ఓమినికామ్​ అనే మీడియా కంపెనీ 45 లక్షల డాలర్లు (సుమారు రూ.32 కోట్లు) పెట్టి యూజర్ల డేటాను తీసుకుందట. స్వయంగా ఓమినికామ్​ ఆ వివరాలను వెల్లడించింది. థర్డ్​ పార్టీ ప్రొవైడర్ల సహకారంతో యూజర్ల డేటా తీసుకుంటూ ఉంటామని హోమ్​ డిపో సహా కొన్ని కంపెనీలు చెప్పాయి. మైక్రోసాఫ్ట్​, గూగుల్​లు దీనిపై స్పందించలేదు.

For More News..

వైరల్ వీడియో: జింకను గన్‌తో కాల్చి.. కత్తితో గొంతు కోసిన వ్యక్తి

ఒలంపిక్స్‌కి అర్హత సాధించిన నీరజ్ చోప్రా

ఆఫ్ఘనిస్తాన్‌పై అమెరికా 7,423 బాంబుల దాడి