న్యూఢిల్లీ: డీమార్ట్ స్టోర్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ2) లో రూ.623.35 కోట్ల నికర లాభం సాధించింది. కిందటే డాది సెప్టెంబర్ క్వార్టర్‌లో వచ్చిన రూ.685.71 కోట్లతో పోలిస్తే ఈసారి నికర లాభం 9.09 శాతం తగ్గింది. జనరల్ మర్చండైజ్, క్లాత్స్ బిజినెస్‌ల నుంచి మార్జిన్స్ (లాభం) పడిపోవడమే ఇందుకు కారణం. రెవెన్యూ మాత్రం రూ. 10,638.33 కోట్ల నుంచి 18.66 శాతం పెరిగి రూ. 12,624.37 కోట్లకు ఎగసింది.
కంపెనీ ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో రూ.11,809 కోట్లను ఖర్చు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్–సెప్టెంబర్ పీరియడ్‌లో అవెన్యూ సూపర్‌మార్ట్స్‌కు రూ.24,489.81 కోట్ల రెవెన్యూపై రూ. 1,282.06 కోట్ల నెట్ ప్రాఫిట్ వచ్చింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో కంపెనీ గ్రాస్ మార్జిన్స్ తగ్గాయి. ఈ క్వార్టర్‌లో కొత్తగా 9 డీమార్ట్ స్టోర్లను ఓపెన్ చేశామని, మొత్తం డీమార్ట్ స్టోర్ల సంఖ్య 336 కి పెరిగిందని వివరించారు.
మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో డీమార్ట్ స్టోర్లను అవెన్యూ సూపర్‌మార్ట్స్ ఆపరేట్ చేస్తోంది.