RR vs LSG: స్టార్క్‌తో పోలిక నాకు ఇష్టం లేదు.. నా లెక్క వేరు: ఆవేశ్ ఖాన్

RR vs LSG: స్టార్క్‌తో పోలిక నాకు ఇష్టం లేదు.. నా లెక్క వేరు: ఆవేశ్ ఖాన్

లక్నో సూపర్ జయింట్స్ ఫాస్ట్ బౌలర్ ఆవేశ్ ఖాన్ ఐపీఎల్ 2025లో తన బౌలింగ్ తో సంచలనంగా మారాడు. శనివారం (ఏప్రిల్ 19) రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయే మ్యాచ్ లో లక్నోని గెలిపించాడు. 17 ఓవర్లు ముగిసేసరికి మ్యాచ్ రాజస్థాన్ చేతుల్లో ఉన్నప్పటికీ తన చివరి రెండు ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో రాజస్థాన్ విజయానికి 9 పరుగులు కావాల్సిన దశలో కేవలం 6 పరుగులే మ్యాచ్ ఇచ్చి లక్నోకి ఊహించని విజయాన్ని అందించాడు.

ఈ మ్యాచ్ తో ఆవేశ్ ఖాన్ ఒక్కసారిగా వైరల్ గా మారిపోయాడు. అంతకముందు స్టార్క్ కూడా రాజస్థాన్ పై 9 పరుగులు చేయాల్సిన దశలో 8 పరుగులే ఇచ్చి మ్యాచ్ టై చేశాడు. ఆవేశ్ ఖాన్ మాత్రం 6 పరుగులే ఇచ్చి మ్యాచ్ ను గెలిపించడం విశేషం. అతడిని ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ తో పోల్చుతూ అభినందిస్తున్నారు. అయితే ఆవేశ్ ఖాన్ మాత్రం తనని స్టార్క్ తో పోల్చడం ఇష్టం లేదన్నట్టు మాట్లాడాడు. మ్యాచ్ తర్వాత నేను స్టార్క్ లా అవ్వాలనుకోవడం లేదు. నేను నాలా బౌలింగ్ చేస్తూ నా మార్క్ కోరుకుంటున్నా". అని ఆవేశ్ ఖాన్ అన్నాడు.

రాజస్థాన్ రాయల్స్ చివరి మూడు ఓవర్లలో 25 పరుగులు చేయాల్సిన దశలో 18 ఓవర్లో ఆవేశ్ ఖాన్ కేవలం 5 పరుగులే ఇచ్చి జైశ్వాల్, పరాగ్ వికెట్లను తీశాడు. ఇక చివరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సిన దశలో హెట్ మేయర్ వికెట్ తీసి 6 పరుగులే ఇచ్చాడు. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 4 ఓవర్లలో 37 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే జైపూర్ వేదికగా శనివారం (ఏప్రిల్ 19) జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ పై 2 పరుగుల తేడాతో నెగ్గింది.

మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసి మ్యాచ్ ఓడిపోయింది. రాజస్థాన్ కు 8 మ్యాచ్ ల్లో ఇది ఆరో ఓటమి కాగా.. మరోవైపు లక్నోకి 8 మ్యాచ్ ల్లో ఇది ఐదో విజయం.