జోహనెస్ బర్గ్ వన్డేలో భారత్ బౌలర్లు అదే పనిగా చెలరేగుతున్నారు. సఫారీ బ్యాటర్లను భయపెడుతూ చుక్కలు చూపిస్తున్నారు. భారత యువ బౌలర్ల ధాటికి సఫారీ బ్యాటర్లు వరుసబెట్టి క్యూ కడుతున్నారు. 13 ఓవర్లలోనే 7 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ సఫారీ బ్యాటర్లను బెంబేలెత్తించడంతో స్వల్ప స్కోర్ కే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తన తొలి ఓవర్లోనే అర్షదీపు సింగ్ వరుసగా నాలుగో బంతికి ఓపెనర్ హేన్డ్రిక్స్ ను క్లీన్ బౌల్డ్ చేయగా.. అయిదో బంతికి వాండెర్ డస్సెన్ ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. ఈ దశలో మూడు పరుగులకే 2 వికెట్లను కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టును కెప్టెన్ మార్కరం, జార్జ్ ఆదుకునే ప్రయత్నం చేశారు. మూడో వికెట్ కు 39 పరుగులు జోడించిన తర్వాత అర్షదీప్ భారత్ కు బ్రేక్ ఇచ్చాడు.
8 ఓవర్ ఐదో బంతికి జార్జ్ ను, 10 ఓవర్ చివరి బంతికి క్లాసన్ ను అవుట్ చేసాడు. నాలుగు వికెట్లు కోల్పోయిన సఫారీలను మరింత కష్టాల్లోకి నెట్టాడు భారత పేసర్ ఆవేశ్ ఖాన్. 11 ఓవర్ తొలి రెండు బంతులకు కెప్టెన్ మార్కరంతో పాటు, మల్డర్ ను పెవిలియన్ కు చేర్చాడు. ఇక జట్టు స్కోర్ 58పరుగుల వద్ద మిల్లర్ వికెట్ తీసుకున్న ఆవేశ్ ఖాన్.. 3 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 15 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. క్రీజ్ లో ఫహుల్క్ వాయో(3), మహారాజ్ (4) ఉన్నారు.
The quality fast bowling of Avesh Khan.
— CricketMAN2 (@ImTanujSingh) December 17, 2023
- Indian fast bowlers dominating in South Africa. pic.twitter.com/uaug8KmK4N