IPL 2025: లక్నోకు బ్యాడ్ న్యూస్: ముగ్గురు మొనగాళ్లు లేకుండానే తొలి మ్యాచ్

IPL 2025: లక్నోకు బ్యాడ్ న్యూస్: ముగ్గురు మొనగాళ్లు లేకుండానే తొలి మ్యాచ్

ఐపీఎల్ తొలి మ్యాచ్ కు ముందు లక్నో సూపర్ జయింట్స్ కు భారీ షాక్ తప్పేలా లేదు. ఆ జట్టు ప్రారంభ మ్యాచ్ కు ముగ్గురు ఫాస్ట్ బౌలర్ల సేవలను కోల్పోయే ప్రమాదంలో ఉంది. టీమిండియా భవిష్యత్ సూపర్ స్టార్స్ మయాంక్ యాదవ్, ఆవేశ్ ఖాన్, మొహ్సిన్ ఖాన్ తొలి మ్యాచ్ కు దూరంగా ఉండనున్నారు. వీరి ముగ్గురి ఫిట్ నెస్ పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం ముగ్గురు బౌలర్లకు ఇంకా నేషనల్ క్రికెట్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ నుండి ఇంకా క్లియరెన్స్ రాలేదు. ఈ ముగ్గురిలో కనీసం ఇద్దరు తొలి మ్యాచ్ కు సిద్ధంగా ఉంచేందుకు లక్నో ఫ్రాంచైజీ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. 

మయాంక్ ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. గత అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్ లో ఇండియా తరపున అరంగేట్రం చేసిన మయాంక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వద్ద పునరావాసం పొందుతున్నాడు. మయాంక్ ఎప్పుడు ఐపీఎల్ లోకి అడుగుపెడతాడో స్పష్టత లేదు.గత సీజన్ లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన మయాంక్ యాదవ్ ని మెగా వేలంలో లక్నో ఫ్రాంచైజీ 11 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకుంది. మయాంక్ లేకపోవడంతో లక్నోకి పెద్ద ఎదురు దెబ్బ తగలనుంది. 

Also Read :- సౌతాఫ్రికా పేసర్‌కు పాక్ క్రికెట్ బోర్డు లీగల్ నోటీసులు

ఐపీఎల్ 2024 సీజన్ లో మయాంక్ యాదవ్ లక్నో తరపున నాలుగు మ్యాచ్ ల్లో 7 వికెట్లు పడగొట్టాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్  చేస్తూ ఒకసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. మయాంక్ తొలి మ్యాచ్ కే కాదు ఫస్ట్ హాఫ్ ఐపీఎల్ మ్యాచ్ లకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆవేశ్ ఖాన్ ప్రస్తుతం మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అతనికి కూడా NCA నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదు. ఇక మొహ్సిన్ గాయం ఎలాంటి అప్ డేట్ లేదు. లక్నో సూపర జయింట్స్ ఐపీఎల్ 2025 సీజన్ లో తమ ప్రారంభ మ్యాచ్ ను ఢిల్లీ క్యాపిటల్స్ పై ఆడుతుంది. విశాఖ పట్నంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.   

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు

బ్యాటర్స్: ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బడోని (రిటైన్), హిమ్మత్ సింగ్, మాథ్యూ బ్రీట్జ్కే.


వికెట్ కీపర్లు: రిషబ్ పంత్, నికోలస్ పూరన్ (రిటైన్), ఆర్యన్ జుయల్.

ఆల్ రౌండర్లు: అబ్దుల్ సమద్ (స్పిన్), మిచెల్ మార్ష్ (పేస్), షాబాజ్ అహ్మద్ (స్పిన్), యువరాజ్ చౌదరి (స్పిన్), రాజవర్ధన్ హంగర్గేకర్ (పేస్), అర్షిన్ కులకర్ణి (పేస్).


స్పిన్నర్లు: రవి బిష్ణోయ్ (రిటైన్), ఎం సిద్ధార్థ్, దిగ్వేష్ సింగ్.

ఫాస్ట్ బౌలర్లు: మయాంక్ యాదవ్ (రిటైన్), మొహ్సిన్ ఖాన్ (రిటైన్), ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, ఆకాష్ సింగ్, షమర్ జోసెఫ్, ప్రిన్స్ యాదవ్.