సాధారణంగా మ్యాచ్ గెలిపించినప్పుడు ఆటగాడి ఆనందం నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. ధోనీ లాంటి అరుదైన క్రికెటర్లు మ్యాచ్ గెలిపించినా సెలెబ్రేషన్ కు దూరంగా ఉంటారు. కానీ వీటన్నిటికీ భిన్నంగా బౌలర్ ఆవేశ్ ఖాన్ ఆటిట్యూడ్ ఉంటుంది. ఒక్క రన్ కొట్టకుండా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు. దీనికి కారణం అతని మితిమీరిన సంబరాలే కావడం గమనార్హం.
ఐపీఎల్ లో భాగంగా నిన్న (ఏప్రిల్ 16) రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను కిక్ ఇచ్చింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరి బంతికి రాజస్థాన్ విజయం సాధించింది. మ్యాచ్ మొత్తం కేకేఆర్ చేతిలో ఉన్నా.. బట్లర్ అసాధారం పోరాటంతో రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. చివరి ఓవర్లో విజయానికి 9 పరుగులు కావాల్సిన దశలో బట్లర్ తొలి 5 బంతుల్లో 8 పరుగులు రాబట్టాడు. చివరి బంతికి ఒక పరుగులు చేయాల్సిన దశలో మిడ్ వికెట్ దిశగా గ్యాప్ లో సింగిల్ తీసి విజయాన్ని అందించాడు.
మ్యాచ్ గెలిచిన తర్వాత ఆవేశ్ ఖాన్ ఎప్పటిలాగే సంతోషంలో మునిగి తేలిపోయాడు. బట్లర్ మీదకు ఎక్కుతూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఒక్క బంతి కూడా ఆడకుండానే ఇతని సెలెబ్రేషన్ వైరల్ గా మారుతున్నాయి. ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జయింట్స్ ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. లక్నో తరపున ఆడిన ఆవేశ్ ఖాన్ ఒక్క పరుగు చేయకుండానే గెలిచిన ఆనందంలో హెల్మెట్ ను నెలపై విసిరాడు. అతను చేసిన ఓవరాక్షన్ కు బీసీసీఐ ఫైన్ విధించింది.
సరిగ్గా అలాంటి సీన్ మరోసారి రిపీటైంది. దీంతో ఆవేశ్ ఖాన్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నాడు. పరుగులు చేయకుండా మ్యాచ్ ను గెలిపించినట్టు ఫీలవ్వడం ప్రతిసారి ఆవేశ్ ఖాన్ కే చెల్లుతుంది. ఆవేశ్ ఖాన్ ఛేజ్ మాస్టర్ అని కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత కేకేఆర్ 20 ఓవర్లలో 223/6 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ స్టార్ జోస్ బట్లర్ (60 బాల్స్‌లో 9 ఫోర్లు, 6 ఫోర్లతో 107 నాటౌట్) సెంచరీతో జట్టును ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు.
Chasemaster Avesh Khan pic.twitter.com/dKABsQfyJi
— Berlin (@BlueandGoldAura) April 16, 2024