అవేవా కస్టమర్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్ సెంటర్‌‌‌‌ ప్రారంభం

అవేవా కస్టమర్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్ సెంటర్‌‌‌‌ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు:  ఇండస్ట్రియల్​, ఇంజనీరింగ్​ సాఫ్ట్‌‌‌‌వేర్, డిజిటల్ ట్రాన్స్‌‌‌‌ఫర్మేషన్  సేవలు అందించే  అవేవా హైదరాబాద్‌‌‌‌లో  కస్టమర్ ఎక్స్‌‌‌‌పీరియన్స్ సెంటర్‌‌‌‌ను ప్రారంభించింది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరు టెక్నికల్​ హబ్‌‌‌‌లలో ఒకటైన ఈ కేంద్రం అవేవాలోనే అతిపెద్దది. అధునాతన ఆర్​అండ్ ​డీ ల్యాబ్‌‌‌‌లు, 1200 కంటే ఎక్కువ మంది  ప్రొఫెషనల్స్​ ఇక్కడ ఉంటారు. 

అవేవా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ స్యూ క్వెన్స్ మాట్లాడుతూ అవేవా వ్యాపారానికి భారతదేశం ఎంతో కీలకమని చెప్పారు.  హైదరాబాద్,  బెంగళూరు నగరాల్లో తగినంత టాలెంట్ అందుబాటులో ఉందని అన్నారు. హైదరాబాద్ కస్టమర్ ఎక్స్‌‌‌‌పీరియన్స్ సెంటర్​లో అధునాతన పారిశ్రామిక ఆర్​అండ్​డీని ఉందని స్యూ వివరించారు. భవిష్యత్తులో ముందుకు సాగే వ్యాపారాల కోసం డిజిటల్ ఆవిష్కరణలను తీసుకొస్తుందని అన్నారు.