![జబర్దస్త్ ఫేమ్ అవినాష్ : హీరోగా పరిచయమవుతున్న చిత్రం ప్రీ వెడ్డింగ్ ప్రసాద్](https://static.v6velugu.com/uploads/2023/09/Avinash-of-Jabardasth-fame-is-acting-in-the-film-Pre-Wedding-Prasad,-in-which-he-is-making-his-debut-as-a-hero_TyJG6cEV4z.jpg)
- ‘జబర్దస్త్’ ఫేమ్ అవినాష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ప్రీ వెడ్డింగ్ ప్రసాద్’.
రాకేష్ దుబాసి దర్శకుడు. సాయి కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్‌పై నబీ షేక్ నిర్మిస్తున్నారు. రామానాయుడు స్టూడియోస్‌లో శుక్రవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ దర్శకుడు కోదండ రామిరెడ్డి క్లాప్ కొట్టారు. రైటర్ కోన వెంకట్ కెమెరా స్విచాన్ చేశారు. దర్శకులు సాయి రాజేష్ సినిమా టైటిల్ లోగోని లాంచ్ చేశారు. వీరభద్రం చౌదరి, నిర్మాత బెక్కం వేణుగోపాల్, సోహైల్, అరియానా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
అవినాష్ మాట్లాడుతూ ‘ సినిమాలో నవ్వుకుంటారు, భయపడతారు, థ్రిల్ అవుతారు.. అన్ని డిఫరెంట్ షేడ్స్ ఇందులో ఉంటాయి’ అని చెప్పాడు. ‘స్క్రీన్ ప్లే చాలా వైవిధ్యంగా ఉంటుంది. సన్నివేశాలు ఊహకు అందనట్టుగా ఉంటాయి’ అని దర్శక నిర్మాతలు చెప్పారు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రాఫర్ కాగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.