
గుండెపోటుతో కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలోచికిత్స పొందుతున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి హెల్త్ బులిటెన్ ను డాక్టర్లు రిలీజ్ చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు ప్రకటించారు. మరికొన్ని రోజులు ఆమెకు ఐసీయూలోనే చికిత్స చేయాలని సూచించారు. ఇంకా బీపీ కంట్రోల్ లోకి రాలేదని తెలిపారు ఆమెకు అల్ట్రాసౌండ్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. శ్రీలక్ష్మి కార్డియో సమస్యతో బాధపడుతున్నారు.
మరోవైపు మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న అవినాష్‌రెడ్డి 2023 మే 22న సీబీఐ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే తల్లి అనారోగ్యం కారణంగానే హాజరుకాలేనని సీబీఐకి అవినాష్‌రెడ్డి లేఖ రాశారు. ఈ క్రమంలో సీబీఐ అధికారులే విశ్వభారతి ఆసుపత్రికి చేరుకున్నారు. అవినాష్‌రెడ్డిని సీబీఐ అధికారులు ఏక్షణమైనా అరెస్టు చేస్తారేమోనని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. విశ్వభారతి ఆసుపత్రి మార్గంలో రాకపోకలపై ఆంక్షలు విధించారు.