వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పతకం చేజారె..

అమెరికాలో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో  అవినాశ్ సాబ్లే పతకం చేజార్చుకున్నాడు. మెన్స్ 3000 మీటర్ల స్టీపుల్ చేజ్‌లో ఫైనల్ చేరిన అవినాశ్..ఫైనల్లో  11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆఖరిపోరాటంలో తన  రేసును సాబ్లే 8.31.31 టైమింగ్‌‌తో పూర్తి చేసి 11వ స్థానంలో నిలిచాడు. ఈ ఫైనల్లో తన పర్సనల్ బెస్ట్ టైమింగ్ (8.12.48) కూడా అందుకోలేకపోయాడు. 2019 దోహా ప్రపంచ ఛాంపియన్ షిప్ లో అవినాశ్ 13వ స్థానంతో నిష్క్రమించాడు. 

బకాలికి స్వర్ణం..
మరోవైపు మెన్స్ 300 మీటర్ల స్టీపుల్ చేజ్లో  మొరాకోకు చెందిన సూఫియాన్‌ బకాలి స్వర్ణ పతకాన్ని సాధించాడు. అతను 8 నిమిషాల 25.13 సెకన్లలో రేసును పూర్తి చేశాడు. అటు ఇథియోపియాకు చెందిన  లమేచా గిర్మా - 8 నిమిషాల 26.01 సెకన్లతో రెండో స్థానాన్ని సాధించి సిల్వర్ ను దక్కించుకున్నాడు. కెన్యా అథ్లెట్ , కాన్సెస్‌లన్‌ కిప్రు టో - 8 నిమిషాల 27.92 సెకన్లతో కాంస్యాన్ని కైవసం చేసుకున్నాడు. 

పసిడితో మెరిసి రోజస్..
ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ యులిమర్ రోజస్ ట్రిపుల్ జంప్లో సత్తా చాటాడు. అతను హ్యాట్రిక్ వరల్డ్ ఛాంపియన్ షిప్ స్వర్ణ పతకాన్ని సాధించాడు.  ఫైనల్లో రోజస్‌ 15.47 మీటర్ల దూరం దూకి ఫస్ట్ ప్లేస్లో నిలిచాడు.  ఈ పోటీలో అమెరికాకు చెందిన  షనీకా రికెట్స్‌  14.89 మీటర్లు సిల్వర్ ను సాధించాడు. అమెరికాకే చెందిన టోరీ ఫ్రాంక్లిన్‌  14.72 మీటర్లతో బ్రౌంజ్ మెడల్ను దక్కించుకున్నాడు.