పొగ తాగితే పళ్లు పాడవుతాయి. నోరు కూడా పాడవుతుంది. ఇక ఊపిరితిత్తులకు క్యాన్సర్ వస్తుంది. గుండె జబ్బులొస్తాయని ఎన్నో ఏళ్ల నుంచి వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ జనం మారట్లేదు.. సిగరెట్ తాగుతూనే ఉన్నారు.. మరణిస్తూనే ఉన్నారు. అయినా రోజు రోజుకు సిగరెట్ తాగేవాళ్లు పెరుగుతూనే ఉన్నారు. అసలు సిగరెట్ మానేస్తే ఎన్ని లాభాలుంటాయో తెలుసుకుందాం. . .
గుండెలో నొప్పి, నోటిలో పుండ్లు, ఆయాసం, ఆకలి లేదని అనుకుంటనే సిగరెట్లు పీల్చితే చివరాఖరికి ఊపిరే పోతది. మందులేసుకుంటూనే పొగతాగితే కాస్తంత రిలీఫ్ అంటారు. పొగతాగితే ప్రాణం పోతుందని అసలు భయమనేది ఉండటం లేదు.. సిగరెట్ తాగడం మానేస్తే మాత్రం ఆరోగ్యం మంచిగా ఉంటుందని అందరికి తెలుసు. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ వో) ప్రచారం చిన్నదే అయినా .. పొగతాగితే ఆరోగ్యం చాలా ఇబ్బంది పెడుతుందని చెబుతుంది.
పొగతాగే అలవాటు ఉన్నోళ్లలో 40 శాతం మంది మంచిక బతకాలంటే స్మోకింగ్ మానేయాలని అంటున్నారు. వాళ్లలో 38.5 శాతం నుంచి మానుకోవాలని కొంచెం ప్రయత్నం చేశారని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది . డైలీ స్మోకర్స్ లో 16.8 శాతం ముంది మాత్రమే పొగతాగడం మానుకున్నారు.
మానేసిన 20 నిమిషాలకు : గుండె సరిగ్గా కొట్టుకోవడం షురూ అవుతుంది. బీపీ కంట్రోల్ అవుతుంది.
12 గంటలకు : రక్తంలో కార్బన్ మోనాక్సైడ్ కొంచెం కొంచెం తగ్గడం మొదలవుతుంది.
2 వారాల నుంచి 3 నెలలకు: గుండెపోటు, గుండె రక్తనాళ సమస్యలు కూడా తగ్గడం మొదలవుతాయి. ఊపిరితిత్తులు మళ్లీ మంచిగా పనిచేయడం మొదలుపెడతాయి.
1 నుంచి 9 నెలలు: దగ్గు తగ్గుతది. ఊపిరి తీసుకున్నప్పుడల్లా ఊపిరితిత్తులు సరిపడ గాలిని తీసుకుంటాయి. ఒంట్లోని కణాలకు ఆక్సిజన్ బాగా అందుతుంది. అవయవాల పనితీరు మెరుగవుతుంది. శరీరం రంగు కూడా మంచిగ మెరుస్తుంది
ఒక ఏడాదికి: ధమనులకు (రక్తనాళాలకు) పట్టిన రోగం సగం తగ్గుతుంది..
5 సంవత్సరాలకు: పొగతాగేవారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ అందుకు కారణాలెన్నో.. ఆ కారణాలన్నీ 5 నుంచి 15 సంవత్సరాలలో పూర్తిగా తగ్గుతాయి.
10 సంవత్సరాలకు: ఊపిరితిత్తుల క్యాన్సర్ (లంగ్ క్యాన్సర్) వచ్చే ప్రమాదం 50 శాతం తగ్గుతుంది.
15 సంవత్సరాలకు: పొగతాగితే పాడయిపోయిన ధమనులన్నీ పూర్తిగ మంచిగా అయి. పొగతాగడానికి ముందు ఉన్నట్లుగా మారుతుంది. పొగతాగని వాళ్ల గుండె ఏ తీరుగా పని చేస్తుందో.. పొగ మానేసిన వాళ్ల గుండె కూడా అట్లానే పనిచేస్తుంది.
సిగరెట్ మానేస్తే లాభాలు
నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్, పాంక్రియాసెస్ క్యాన్సర్ కారకాలు పూర్తిగా తగ్గిపోతాయ్. క్యాన్సర్ తో బాధపడేవారితో పొగాకు వినియోగించేవాళ్లు 10 శాతం మంది ఉన్నారు.
దేశంలో పొగతాగే అలవాటుతో ఏటా పది లక్షల మంది చచ్చిపోతున్నారు.
ఏడాది చావుల్లో 9.5 శాతం మరణాలకు కారణం పొగాకు.
పొగాకు నమిలే (స్మోక్ లెస్ టొబాకో యూజర్స్) అలవాటు ఉన్నవాళ్లలో 31.7 శాతం మంది ఆరోగ్యంగా ఉండాలని పొగాకు మానాలనుకుంటున్నారు. స్మోక్ లెస్ టొబాకో యూజర్స్ 33.2 శాతం మంది పొగాకు మానాలని ప్రయత్నం చేశారు. కానీ వాళ్లలో 5.8 మంది మాత్రమే పొగాకుని దూరంపెట్టినారు
పక్కోళ్లు పొగతాగితే పక్కనే ఉన్న పొగతాగని వాళ్లకు కూడా రోగాలొస్తాయ్.. గుండెపోటు, గుండె జబ్బులు, క్యాన్సర్, ఇతర రోగాల్లో ఇటువంటి వారు 14శాతం మంది ఉన్నారు..
గుండెపోటు: గుండె– రక్తనాళాలకు ఉన్న రోగాలతో బాధపడేవారిలో పొగతాగడం, పొగాకు నమిలే అలవాటు ఉన్న వాళ్లే సగం మంది. అంటే దాదాపు 48 శాతం అన్నమాట.