Kannappa: మంచు ఫ్యామిలీ మూడో తరం వచ్చేస్తోంది..అవ్రామ్‌ భక్త ఫస్ట్ లుక్ రిలీజ్

హీరో మంచు విష్ణు కొడుకు అవ్రామ్‌ భక్త మంచు (Avram Manchu) సినిమాలలో ఎంట్రీ ఇస్తున్నాడు. మంచు విష్ణు లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’. మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌‌‌‌కుమార్‌‌‌‌ సింగ్‌‌‌‌ దర్శక‌‌‌‌త్వం వ‌‌‌‌హిస్తున్నాడు.

తాజాగా ఈ ప్రతిష్ట్మాకమైన ప్రాజెక్ట్ లో అవ్రామ్‌ భక్త ‘యువ తిన్నడు’ పాత్రలో నటిస్తున్నాడని మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన అవ్రామ్‌ ఫస్ట్ లుక్ ను శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అనౌన్స్ చేశారు. 

"జన్మాష్టమి శుభ సందర్భంగా అవ్రామ్‌ మంచుని యువ తిన్నడు అకా కన్నప్పగా ప్రదర్శిస్తున్నాము..ఇది మాలో గర్వాన్ని నింపుతుంది, మీరందరూ మాపై చేసినట్లుగా..మీ ప్రేమను మరియు ఆశీర్వాదాలను అవ్రామ్‌ పై కూడా చూపిస్తారని ఆశిస్తున్నాము" అంటూ మంచు విష్ణు  తెలిపారు. ఇక మంచు ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరో కూడా వస్తుండటంతో ఫ్యాన్స్ వెల్కమ్ చెబుతూ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం తిన్నడు’ పాత్రకి సంబంధించిన లుక్ సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. 

పాన్ ఇండియా భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, శరత్ కుమార్, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి  స్టీఫెన్ దేవస్సీ సంగీతాన్ని అందిస్తున్నాడు. అవా ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు.