
నర్సాపూర్, శివ్వంపేట, వెలుగు : బాండ్‌పేపర్ మీద హామీ ఇస్తున్నా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలు పక్కాగా అమలు చేస్తామని కాంగ్రెస్ నర్సాపూర్ అభ్యర్థి అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి అన్నారు. మంగళవారం ఓటర్ల ముందర బాండ్ పేపర్ మీద సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాట ఇస్తే తప్పకుండా పక్కాగా అమలు చేసే పార్టీ కాంగ్రెస్ అన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, మండలానికో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయిస్తానని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగొద్దు
నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కాంగ్రెస్ అనుకూల వాతావరణం ఉంది. దీంతో అధికార బీఆర్ఎస్ ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉంది. అందువల్ల కాంగ్రెస్ శ్రేణులు రెండు రోజులు చాలా అలర్ట్‌గా ఉండాలని ఆవుల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. శివ్వంపేట మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. గడచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. 2018 ఎన్నికల సమయంలో నర్సాపూర్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని చెప్పిన కేసీఆర్ ఆ మాటే మరిచిపోయారని విమర్శించారు.
మళ్లీ ఇపుడు వచ్చి ఈ సారి గెలిపిస్తే నర్సాపూర్‌ను బంగారు తునక చేస్తానని చెబితే నమ్మేవారు ఎవరూ లేరన్నారు. మాయ మాటలు చెప్పే బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలని ప్రజలు డిసైడ్ అయ్యారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిలుముల సుహానిసి రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ఆంజనేయులు గౌడ్, కరుణాకర్ రెడ్డి, సుదర్శన్ గౌడ్, నవీన్ గుప్తా, సుధీర్ రెడ్డి, శ్రీనివాస్, అశోక్, వెంకటేశ్, రవీందర్‌గౌడ్, గణేశ్ గౌడ్, నాగేశ్, లక్ష్మీకాంతం పాల్గొన్నారు.