27న ‘ఓరి దేవుడా’ నుంచి సెకండ్‌ సాంగ్

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘ఓరి దేవుడా’ చిత్రంలో నటిస్తున్నాడు. త‌మిళంలో విజయం సాధించిన ‘ఓమై క‌డువ‌లే’ చిత్రానికి ఇది రీమేక్‌. అశ్వత్ మ‌రిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. విశ్వక్‌కు జోడీగా మిథిలా పాల్కర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ దేవుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే వెంకీకి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ నుండి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌.

‘ఓరి దేవుడా’ నుంచి సెకండ్‌ సింగిల్‌ ‘అవుననవా’ అంటూ సాగే మెలోడీ సాంగ్‌ గ్లింప్స్‌ను వదిలారు. పూర్తి పాటను సెప్టెంబర్ 27న (మంగళవారం) విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ‘పాఠశాలలో’ పాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. లియన్‌ జేమ్స్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీవిపీ సినిమాస్‌, శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.