
గజ్వేల్, వెలుగు: వర్గల్ మండలం అవుసులోని పల్లి, రామక్కపేటకు చెందిన 50 మంది భూ నిర్వాసితులు కాంగ్రెస్‌లో చేరారు. బుధవారం హైదరాబాద్‌లోని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక భూ నిర్వాసితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
దళారి అవతారం ఎత్తిన సర్కారు పచ్చని పంట పొలాలను కార్పొరేట్లకు దారాదత్తం చేస్తుందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో తీసుకెళ్లి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని, కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు తూంకుట నర్సారెడ్డి, పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి , మాజీ ఎంపీపీలు నిమ్మ రంగారెడ్డి , భాగనోళ్ల మోహన్ , కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సందీప్ రెడ్డి , నేతలు ప్రవీణ్ గౌడ్ , నర్సారెడ్డి, నందు , గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు .