అత్యవసర సేవలకు సంజీవిని అంబులెన్స్

అత్యవసర సేవలకు సంజీవిని అంబులెన్స్
  •     ఎమ్మెల్యే జారే ఆదినారాయణ 

అశ్వారావుపేట, వెలుగు : అత్యవసర సేవలకు ప్రాణాలను కాపాడేందుకు అంబులెన్స్ సంజీవిని లాంటిదని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. శనివారం భద్రాచలం ఐటీడీఏ ద్వారా వినాయకపురం పీహెచ్​సీకి ప్రత్యేకంగా మంజూరైన అవ్వల్ అంబులెన్స్ వాహనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీహెచ్​సీ పరిధిలోని కొండరెడ్లు

గిరిజనుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన అంబులెన్స్ ద్వారా ఉత్తమ సేవలు అందించాలన్నారు అంబులెన్స్ ద్వారా గర్భిణులకు సేవలు అందించి మాత, శిశు, మరణాలను తగ్గించడం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ వో భాస్కర్ నాయక్ డాక్టర్లు రామదాస్ నాయక్, కృష్ణ దీపక్ రెడ్డి పాల్గొన్నారు.

గంజాయి రవాణాపై నిఘా పెంచాలి

ములకలపల్లి : గంజాయి రవాణాపై నిఘా పెంచాలని అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధికారులకు సూచించారు. శనివారం మండలంలో జరిగిన పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన జగన్నాధపురంలో విలేకరులతో మాట్లాడారు. ములకలపల్లి మండలంలో తొలిసారిగా గంజాయి సీజ్ చేసిన విషయంపై ఆయన స్పందించారు. గంజాయి రవాణాలో ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు.

ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆర్ఎంపీ ఇనుగుర్తి రామును పరామర్శించారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు  తాండ్ర ప్రభాకర్ రావు, మాజీ సర్పంచులు కారం సుధీర్, సున్నం సుధాకర్, నాయకులు ఉన్నారు.