కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారత డాక్యుమెంటరీకి అవార్డు

కేన్స్ 2022 ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతీయ డాక్యుమెంటరీ అయిన ఆల్ దట్ బ్రీత్స్(All That Breathes) L'Oeil' d' or అవార్డును దక్కించుకుంది. కాలుష్యం నేపథ్యంలో రూపొందించిన ఈ డాక్యుమెంటరీ పక్షులను రక్షించేందుకు పూనుకున్న ఇద్దరు సోదరుల ఆధారంగా తీయబడింది. అంతే కాదు ఈ ఫిల్మ్ ఇప్పటికే వరల్డ్ సినిమా గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ ను కూడా సొంత చేసుకుంది. ఇక్కడ ఇంకో చెప్పుకోదగిన విషయం ఏమిటంటే భారతదేశం నుంచి అధికారికంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లోకి అడుగుపెట్టిన డాక్యుమెంటరీగా కూడా ప్రసిద్ధికెక్కింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఓ ప్రత్యేక ఫొటోను షేర్ చేస్తూ.. అవార్డు అందుకున్నందుకు గాను కంగ్రాజ్యులేషన్స్ అంటూ ఇండియన్ ఫిల్మ్ మేకర్ శౌనక్ సేన్ ను ప్రశంసించారు. ఇలా ప్రపంచ వేదికపై ఈ అవార్డును తీసుకోవడం అనేది మరికొందరు ఇండియన్ మేకర్స్ కి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ఆకాంక్షించారు.