జపాన్‌లో తెలంగాణ శాస్త్రవేత్తకు అవార్డు

పట్టు పరిశ్రమలో పరిశోధనలతో విశేష కృషి చేసిన తెలంగాణ శాస్త్రవేత్త డాక్టర్‌ తాళ్లపల్లి మొగిలి జపాన్‌లోని అంతర్జాతీయ పట్టు కమిషన్‌ నుంచి ప్రతిష్టాత్మక లూయీస్‌ పాశ్చర్‌ అవార్డు అందుకున్నారు. జపాన్‌లోని సుకుబా నగరంలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందుకున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల మండలం చర్లపల్లికి చెందిన మొగిలి కాకతీయ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్‌ పొందారు. మల్బరీలో కొత్త వంగడాల అభివృద్ధిలో ఆయన విశేష కృషి చేశారు. 30 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వ పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేశారు.