- అమిత్ షా నుంచి అవార్డు స్వీకరించిన శిఖా గోయల్
న్యూఢిల్లీ, వెలుగు: నేర విశ్లేషణ మాడ్యూల్ అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ చూపిన ప్రతిభకు కేంద్ర అవార్డు దక్కింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4 సీ) మొదటి ఆవిర్భావ దినోత్సవం ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో మంగళవారం నిర్వహించారు.
కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హోం మంత్రి అమిత్ షా, సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా చేతుల మీదుగా రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ అవార్డును స్వీకరించారు. నేర గణాంకాల విశ్లేషణ, నేరగాళ్ల నెట్‌వర్క్‌ను గుర్తించడంలో తెలంగాణ పోలీసులు పోషిస్తున్న పాత్రను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు.