
సూర్యాపేట, మునగాల, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో ఉత్తమ సేవలందించిన కలెక్టర్ వెంకట్‌రావుకు స్టేట్ లెవెల్ అవార్డు లభించింది. గురువారం హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ ఆడిటోరియంలో నిర్వహించిన జాతీయ ఓటర్ దినోత్సవంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అలాగే జిల్లా స్థాయిలో మునగాల తహసీల్దార్ ఆంజనేయులు బెస్ట్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు ప్రియాంక, వెంకట్ రెడ్డి ఈయనకు అవార్డు అందించారు.