కాజీపేట రైల్వే డీజిల్ షెడ్​కు అవార్డు

కాజీపేట, వెలుగు :  రైల్వేలో  దేశంలోని అన్ని డీజిల్ షెడ్లలో కన్నా కాజీపేట డీజిల్ షెడ్ బెస్ట్ మెయింటెనెన్సు ఆఫ్ ఎలక్ట్రిక్ లోకోస్ గా అవార్డు అందుకున్నదని  రైల్వే అధికారులు తెలిపారు.  ఎలక్ట్రిక్ లోకో రైలింజన్ల మరమ్మతు, నిర్వహణలో   ఇండియన్ రైల్వే బోర్డు కాజీపేట షెడ్​ను ఎంపిక చేసిందని చెప్పారు.

ఈ అవార్డుని గురువారం  సికింద్రాబాద్​లోని రైల్వే జీఎం ఆఫీస్​లో జీఎం ఏకే జైన్​  అందించారని   షెడ్ సీనీయర్ డీఎంఈ స్వరాజ్​కుమార్  తెలిపారు. అనంతరం కార్మికులతో కలిసి సంబురాలు జరిపారు.  కార్యక్రమంలో డీఎంఈ అనికేత్ కాడే, ఎస్ఎంఎం అతుల్ ద్వివేది, ఏసీఎంటీ రవీంద్ర కుమార్ పాల్గొన్నారు.