ఏపీ ఫొటోగ్రఫీ అకాడమీ పోటీల్లో వీ6 వెలుగు ఫోటోగ్రాఫర్కు అవార్డు

ఏపీ ఫొటోగ్రఫీ అకాడమీ పోటీల్లో వీ6 వెలుగు ఫోటోగ్రాఫర్కు అవార్డు

హైదరాబాద్, వెలుగు: 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ నిర్వహించిన పోటీల్లో వీ6 వెలుగు దినపత్రికలో పనిచేస్తున్న రావుట్ల శ్యాంకుమార్​కు అవార్డు దక్కింది. జాతీయ స్థాయిలో జరిగిన ఈ పోటీలో దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. వారిలో 75 మంది తీసిన ఫొటోల్ని ఎంపిక చేశారు. వాటితో ఎగ్జిబిషన్‌‌ నిర్వహించి, ఎంపికైన ఫొటోలన్నింటినీ కలిపి బుక్‌‌లెట్‌‌గా ప్రింట్ చేయనున్నారు. శ్యాంకుమార్ తీసిన ఫొటో కూడా వీటిలో ఉండడం విశేషం. గురువారం  విజయవాడలోని బాలోత్సవ్ భవన్‌‌లో జరగనున్న కార్యక్రమంలో విజేతలను సత్కరించనున్నారు.