అద్భుత దృశ్య మాలిక: అవార్డ్ విన్నింగ్ ఫొటోగ్రాఫ్స్

అద్భుత దృశ్య మాలిక: అవార్డ్ విన్నింగ్ ఫొటోగ్రాఫ్స్

ఏయ్​..! నా తోక వదులు – నా గూటిలోకి దూరదామనే..

మహారాష్ట్రలోని భరత్​పురాలో కియోలాడియో నేషనల్​ పార్క్​లో ఒక చెట్టు తొర్రలోకి వెళ్తున్న బల్లిని, రామచిలుక ఇలా అడ్డుకుంది. ఈ ఫొటో కోసం ఫొటోగ్రాఫర్​ హిరా పంజాబీ.. ఆ చెట్టు దగ్గర నాలుగు రోజులు వెయిట్ చేసి మరీ తీసిందట. ఈ ఫొటోకిగాను ఆమెకు ‘ఎస్​ఐఎన్​డబ్ల్యూపీ బర్డ్​ ఫొటోగ్రాఫర్​ ఆఫ్​ ది ఇయర్ 2024’ అవార్డ్​ సొంతమైంది.

అరుదైన దృశ్యం!

కొంగకు ఆహారం కాబోయే ముందు చేప ఇలా... ఎవరైనా చూసుంటారా? అందుకే ఈ అరుదైన దృశ్యాన్ని కెమెరాలో బంధించిన అర్నే బివ్రిన్​కు జడ్జెస్ ఛాయిస్​ అవార్డ్​ దక్కింది. 

జస్ట్​ ల్యాండింగ్...

ఫిన్లాండ్​లోని కుసమొలో తెల్లటి మంచు దుప్పటి మీద గ్రేట్​ గ్రే గుడ్లగూబ ఆకాశంలో ఎగురుతూ వచ్చి జస్ట్​ అలా ల్యాండ్​ అయిందంతే.. మ్యాగీ బుల్లక్ కెమెరా క్లిక్​మనించింది.