భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఇంటర్నేషన్ స్థాయిలో తన ప్రతిభతో పతకాలు సాధించి రత్నకుమారి దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఎస్పీ బి. రోహిత్ రాజు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో హర్డిల్స్ విభాగాల్లో బంగారు పతకాలు సాధించిన కానిస్టేబుల్ రత్నకుమారిని కొత్తగూడెంలోని ఎస్పీ ఆఫీస్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 మీటర్స్, 400 మీటర్స్ హర్డిల్స్ విభాగాల్లో జాతీయ స్థాయిలో రత్నకుమారి బంగారు పతకాలు సాధించడం అభినందనీయమన్నారు.
కొత్తగూడెంలోని త్రీటౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రత్న కుమారి భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. మరిన్ని విజయాలు సాధించేందుకు రత్నకుమారి డిపార్ట్మెంట్ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ఈ ప్రోగ్రాంలో డీఎస్పీ రెహమాన్, త్రీటౌన్ సీఐ శివప్రసాద్ పాల్గొన్నారు.