రాష్ట్ర పోలీస్ స్పొర్ట్స్ మీట్లో.. పతకాలు సాధించిన సిబ్బందికి సన్మానం

రాష్ట్ర పోలీస్ స్పొర్ట్స్ మీట్లో..  పతకాలు సాధించిన సిబ్బందికి సన్మానం

వికారాబాద్, వెలుగు: కరీంనగర్​లో జరిగిన 3వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పొర్ట్స్ మీట్​లో వికారాబాద్ ​జిల్లా పోలీస్ అధికారులు 7 పతకాలు సాధించారు. వీరిని ఎస్పీ నారాయణరెడ్డి సోమవారం సన్మానించారు. మున్ముందు మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

 కనోయింగ్​లో అబ్దుల్ మన్సూర్ సిల్వర్, హైజంప్​లో కె.స్వాతి సిల్వర్, బాక్సింగ్​లో టి.ప్రకాశ్ కాంస్యం, హైజంప్​లో ఏ.శివ దర్శన్ కాంస్యం, టైక్వాండోలో ఎన్ శ్రీను, జి.శ్రీనివాస్ కాంస్య పతకాలు, స్విమ్మింగ్​లో రవీందర్ కాంస్య పతకం సాధించినట్లు తెలిపారు.