
హనుమకొండ, వెలుగు : ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి ఆధ్వర్యంలో టీఐటీఏ అధ్యక్షుడు సందీప్ మక్తాల అధ్యక్షతన సింగపూర్ లో నిర్వహించిన ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలో సామాజిక రంగ విభాగంలో తెలంగాణ నుంచి ఈవీ శ్రీనివాస రావుకు సామాజిక సేవ అవార్డు లభించింది.
ఈ సందర్బంగా ఐటీ, ఇతర రంగాల్లో పలువురు ప్రముఖులకు అవార్డు ప్రదానం చేశారు. దాదాపు 80కి పైగా దేశాల నుంచి తెలుగు ఐటీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
సమావేశాల్లో తెలంగాణ ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి. ప్రకాశ్, తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ పి. జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.