ఇంటర్​ స్టూడెంట్స్​కు అవార్డులు

  • కలెక్టర్​ ఇలా త్రిపాఠి 

ములుగు, వెలుగు : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను  పెట్టుకొని, వాటి కోసం కృషి చేయాలని  కలెక్టర్​ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్​ కార్యాలయంలో టెన్త్​, ఇంటర్మీడియట్​ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఎస్పీ పి.శబరీశ్​,  అడిషనల్​  కలెక్టర్​ శ్రీజతో   కలిసి కలెక్టర్​ అవార్డులు అందజేశారు.  చదువుల్లో రాణిస్తే సమాజంలో మంచి గౌరవం పొందుతారన్నారు.  

అనంతరం విద్యార్థులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ  సత్యపాల్ రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు, డీఈఓ పాణిని, జిల్లా మైనారిటీ అధికారిని ప్రేమలత పాల్గొన్నారు.