- నేడు హైదరాబాద్‌లో బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక
- సా. 6 నుంచి జియో సినిమాలో లైవ్
హైదరాబాద్ : టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్.. బీసీసీఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్–2023 అవార్డుకు ఎంపికయ్యాడు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో జరిగే వార్షిక అవార్డుల కార్యక్రమంలో గిల్‌కు బోర్డు ఈ పురస్కారాన్ని అందజేయనుంది. గత 12 నెలల్లో అద్భుత పెర్ఫామెన్స్ చేసిన గిల్ వన్డేల్లో వేగంగా 2 వేల రన్స్ మార్క్‌ను అందుకున్నాడు.
ఇందులో ఐదు సెంచరీలు కూడా ఉన్నాయి. మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు అందుకోనున్నాడు. 61 ఏళ్ల శాస్త్రి తన కెరీర్‌లో 80 టెస్ట్‌లు, 150 వన్డేలు ఆడాడు. రిటైర్మెంట్ తర్వాత రెండు పర్యాయాలు టీమిండియాకు చీఫ్ కోచ్‌గా వ్యవహరించాడు.