కాంగ్రెస్ సభ్యత్వ నమోదుపై అవగాహన

కాంగ్రెస్ సభ్యత్వ నమోదుపై అవగాహన

పంజాగుట్ట, వెలుగు: సనత్​నగర్​నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ నేతలకు గురువారం పార్టీ సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించారు. పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జ్​కోట నీలిమ పాల్గొని దిశా నిర్దేశం చేశారు. కేంద్రంలో బీజేపీకి గట్టి పోటీ ఇస్తూ, ప్రజల హక్కుల కోసం పోరాడే ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ అన్నారు. పార్టీలోని మహిళలకు పెద్దపీట వేస్తోందన్నారు. సభ్యత్వ నమోదులో సనత్​నగర్ నియోజకవర్గం ముందు ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్​ సీనియర్​ నేత కవిత, ప్రతినిధులు పాల్గొన్నారు.